
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉందే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ట్విట్టర్ వేదికగా సోమవారం సజ్జనార్ ఓ మీమ్ పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో హీరో మహేశ్ బాబు బైక్ నడుపుతున్న ఫొటోలతో ఉప్పల్, జీడిమెట్ల, ఆరాంఘర్.. తూ దీనమ్మ జీవితం.. ట్యాంకులు, ట్యాంకులు పెట్రోల్ అయిపోతుంది. సిటీలో తిరుగుదామంటే.. అని కామెంట్ చేశారు. దానికి మహేశ్ మరొక ఫొటోతో కౌంటర్ ఇస్తూ.. అందుకే బ్రదర్ లీటర్ పెట్రోల్ కంటే తక్కువ ధరకే టీఎస్ ఆర్టీసీ వారి టీఎస్24 టికెట్‌తో 24 గంటల పాటు సిటీలో అంత తిరుగు.. అంటూ రాసి ఉన్న ఓ మీమ్ ఫొటోను షేర్ చేశారు.
దీనిపై చాలా మంది ట్విట్టర్ యూజర్లు స్పందిస్తున్నారు. కొందరు ఆయన ట్వీట్ ను షేర్ చేస్తుంటే.. మరి కొంతమంది అవును.. సార్ మీరు చెప్పింది నిజమేనంటూ కామెంట్ చేస్తున్నారు. తమదైన శైలిలో ట్వీట్ పై స్పందిస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ ధరలపై సెటైర్ వేస్తూ.. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం గురించి ఆలోచించేలా సజ్జనార్ ట్వీట్ చేశారంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కి విశేష స్పందన వస్తోంది.
Travel in #TSRTC Safely with less cost#sundayvibes @urstrulyMahesh @puvvada_ajay @Govardhan_MLA @RGVzoomin @DarshanDevaiahB @HUMTA_hmdagov @airnews_hyd @maheshbTOI @balaexpressTNIE @V6_Suresh @PranitaRavi @baraju_SuperHit @abntelugutv @AbhiramNetha @iAbhinayD @Telugu360 @TSRTCHQ pic.twitter.com/hvQVZytMNe
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 31, 2021