T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. టాస్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ మైదానం చేజింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.. వికెట్లను క్రమంగా తీయడం వలన విండీస్ ను కట్టుడి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. గత మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో బాగా ఆడాం.. అదే జట్టుతో బరిలోకి దిగుతున్నామని సూర్యకుమార్ వెల్లడించారు.
వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే మేము కూడా మొదట బౌలింగ్ తీసుకునే వాళ్లం అన్నాడు.. స్థిరమైన క్రికెట్ ఆడటం మాకు చాలా ముఖ్యం.. చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఇక్కడ ఆడిన అనుభవం ఉందన్నారు. ఈ రోజు మేము బాగా రాణించగలమని ఆశిస్తున్నాము.. ఇది ఇది డూ ఆర్ డై గేమ్.. దీని కోసమే మేము ఆడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం తుది జట్టులో ఒక మార్పు మాత్రమే చేసినట్లు తెలిపారు. బ్రాండన్ కింగ్ స్థానంలో అకేల్ హోసేన్ టీమ్ లోకి వచ్చినట్లు చెప్పాడు.
భారత్:
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్:
షాయ్ హోప్( వికెట్ కీపర్/ కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్
