ఓలా కారు మీరే నడుపుకోవచ్చు

ఓలా కారు మీరే నడుపుకోవచ్చు

న్యూఢిల్లీ : క్యాబ్ అగ్రిగేటర్‌‌‌‌ ఓలా అధికారికంగా సెల్ఫ్ డ్రైవ్ కారు రెంటల్ సర్వీస్‌‌ల్లోకి అడుగుపెట్టింది. తన ప్లాట్‌‌ఫామ్‌‌పై ‘ఓలా డ్రైవ్’ కింద ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి నాటికి 20 వేల వెహికిల్స్‌‌ను యాడ్ చేయాలనేదే ఓలా లక్ష్యం. ఈ సర్వీసులను తొలుత పైలెట్ ప్రాజెక్ట్‌‌గా  బెంగళూరులో ప్రారంభించింది. ఈ  సర్వీసులను హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో త్వరలోనే లాంచ్ చేయాలని ఓలా ప్లాన్ చేస్తోంది. ఈ స్పేస్‌‌లో ఉన్న ఇతర ప్రత్యర్థులతో పోలిస్తే 30 శాతం తక్కువగా సెల్ఫ్ డ్రైవ్ కార్లను అందిస్తామని ఓలా చెబుతోంది.

రెసిడెన్షియల్, కమర్షియల్ హబ్స్‌‌లోని పలు పికప్ స్టేషన్ల ద్వారా ఓలా ఈ సర్వీసులను యూజర్లకు ప్రవేశపెట్టింది. రూ.2000 డిపాజిట్‌‌ను చెల్లించి రెండు గంటల కోసం యూజర్లు తమకు నచ్చిన కారును బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసును షార్ట్ టర్మ్ సెల్ఫ్ డ్రైవ్ కారు షేరింగ్‌‌ సర్వీస్‌‌గా ఆఫర్‌‌‌‌ చేస్తున్నామని ఓలా చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ అరుణ్  చెప్పారు.లాంగ్ టర్మ్ సబ్‌‌స్క్రిప్షన్‌‌ను, కార్పొరేట్ లీజింగ్, ఇతర ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టేందుకు చూస్తున్నామని తెలిపారు.