ఓలా, ఉబర్ విలీనమన్న వార్త అవాస్తవం

ఓలా, ఉబర్ విలీనమన్న వార్త అవాస్తవం

దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాత సంస్థలైన ఉబర్, ఓలాలు విలీనం కానున్నాయన్న వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల ఓనర్లు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు సంస్థలూ విలీనం కాబోతున్నాయన్న వార్తల్లో ఎలాంటి వాస్తవమూ లేదని ఓలా ఎలక్ర్టానిక్ సీఈవో భవిష్ అగర్వాల్ తేల్చి చెప్పారు. తమ సంస్థ మరింత అభివృద్ధి చెందుతోందన్న ఆయన.. విదేశీ సంస్థ ఉబర్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విలీనం అనేది పూర్తిగా అబద్దమని, తాము లాభాల్లోనే ఉన్నామని తెలిపారు. భారతీయ మార్కెట్ నుంచి ఏదైనా సంస్థ విలీనం కావాలని భావిస్తే తాము ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పారు. కానీ తాము మాత్రం ఎన్నటికీ విలీనం కామని భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు.

ఈ విషయంపై ఉబర్ సైతం స్పందించింది. విలీనంపై వస్తున్న వార్తలను, ఊహాగానాలను కొట్టిపారేసింది. తాము విలీనం కావడం లేదని, కాబోమని కూడా తెలిపినట్టు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల ప్రముఖ సంస్థలైన ఓలా, ఉబర్ లు విలీనం అవుతాయన్న వార్తలను ఖండిస్తూ ఇలా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి.