ఒమిక్రాన్ వైరస్ ఎఫెక్ట్.. లక్నో ఎయిర్ పోర్టులో ముందస్తు చర్యలు

ఒమిక్రాన్ వైరస్ ఎఫెక్ట్.. లక్నో ఎయిర్ పోర్టులో ముందస్తు చర్యలు

ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో లక్నో ఎయిర్ పోర్టులో ముందస్తు చర్యలు చేపట్టారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్టులు కంపల్సరీ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల పాటు హోం క్వారంటైన్ లో తప్పకుండా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. కేంద్రం జారీ చేసిన కోవిడ్ రూల్స్ పాటించాలంటూ ప్రయాణికులకు తెలియజేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ఎయిర్ పోర్టులోనే థర్మల్ స్క్రీనింగ్ లో చేసి ఉచితంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. పూర్తి వివరాలను అధికారులకు అందజేయాలని ప్రయాణికులను యూపీ సర్కార్ కోరింది. హోం క్వారంటైన్ గడువు అయిపోయిన తర్వాత మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తామంటూ తెలిపింది.