రైతు రుణమాఫీ చేయని మోదీ.. 16 లక్షల కోట్లు కార్పొరేట్ల లోన్లు మాఫీ చేసిండు: వివేక్ వెంకటస్వామి

రైతు రుణమాఫీ చేయని మోదీ..  16 లక్షల కోట్లు  కార్పొరేట్ల లోన్లు మాఫీ చేసిండు: వివేక్ వెంకటస్వామి

గత పదేళ్లుగా  రాష్ట్రంలో కెసీఆర్ దేశంలో నరేంద్ర మోడీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో కేసీఆర్ ఆంధ్రాకాంట్రాక్టర్లను పెంచి పోషిస్తే.. కేంద్రంలో  మోడీ ఆదాని అంబానీలకు దోచిపెట్టారని ఆరోపించారు.  రైతులకు రుణమాఫీ చేయని మోదీ.. పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్ల రూపాయల అప్పు మాఫీ చేశారని ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 

ధర్మపురి మండలం దమ్మన్నపేట్ నేరెళ్ల గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలతో సమావేశమైన వివేక్ వెంకటస్వామి.. ధర్మపురి అభివృద్ధి కోసం లక్ష్మణ్ కుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్తే.. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.  కొప్పుల ఈశ్వర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని  కాలేశ్వరం లింక్ 2 ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 350 ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకొని వారికి  అన్యాయం చేశారని మండిపడ్డారు. 10 ఏళ్లుగా  ఏమి చేయని బీఆర్ఎస్ నేతలు 100 రోజుల కాంగ్రెస్ పాలనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు వివేక్.