- ప్రాజెక్టు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ )చందన్ కుమార్ సమాంత
జ్యోతినగర్, వెలుగు: విద్యుత్ ఉత్పత్తిలో ఎన్టీపీసీ ఎవరెస్ట్ శిఖరంలా ఎదుగుతోందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ )చందన్ కుమార్ సమాంత అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన సంస్థ 51వ ఆవిర్భావ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశానికి కరెంట్ కొరతను తీర్చడంలో సంస్థ అహర్నిశలు శ్రమిస్తోందన్నారు.
విద్యుత్ ఉత్పత్తితో పాటు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని అన్ని విభాగాల్లో ఎన్నో అవార్డులు అందుకొందన్నారు. పర్యావరణ పరిరక్షణకు లక్షలాది మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎన్టీపీసీ దేశంలో 108 ప్లాంట్ల ద్వారా 84,849 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తోందన్నారు. 2032 నాటికి 150 గిగావాట్ల లక్ష్యంతో కొత్త ప్రాజెక్టులను ఏర్పాటుకు కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం సంస్థలో 18,816 మంది ఉద్యోగాలు ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
