చేపల కోసం వల వేస్తే కొండ చిలువ పడింది.. ఎంత పెద్దగా ఉందో చూడండి !

చేపల కోసం వల వేస్తే కొండ చిలువ పడింది.. ఎంత పెద్దగా ఉందో చూడండి !

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్లో చేపలు పడుతుండగా అతిపెద్ద కొండచిలువ మత్స్యకారుడి వలలో పడింది. గన్నేరువరం మండలానికి చెందిన కళ్లెం రాము అనే జాలరి చేపలు పడుతుండగా వలలో కొండచిలువ చిక్కుకొని చనిపోయింది. 

తెప్ప మీద బయటకు తీసుకొచ్చి తీరంపై ఉంచగా కొండచిలువలో కదలిక లేదు. వల నైలాన్ దారాలు మధ్య ఊపిరాడక కొండచిలువ మరణించి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. లోయర్ మానేరు డ్యామ్లో కొండచిలువ జాలర్ల వలలో పడటం ఇవాళ కొత్త కాదు.

2022లో కూడా.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో మత్స్యకారుల వలకు కొండ చిలువ చిక్కింది. లోయర్ మానేర్ డ్యాంలో చేపలు పట్టేందుకు రాత్రి వలవేసి పెట్టగా ఉదయం వచ్చి చూసేసరికి వలలో సుమారు మూడు మీటర్ల కొండచిలువ కనిపించింది. దీంతో మత్స్యకారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వలను ఒడ్డుకు లాక్కొచ్చారు.

వలలో చిక్కుకున్న కొండ చిలువ అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. గతంలోనూ గన్నేరువరం మత్స్యకారులకు రెండు సార్లు వలలకు కొండచిలువ చిక్కింది. లోయర్ మానేరు డ్యామ్లో ఇంకా ఎన్ని కొండ చిలువలు ఉన్నాయో.. ఏంటోనని మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు.

►ALSO READ | బుసలు కొడుతున్న నాగు పాము చెరలో కుక్క పిల్లలు.. తల్లి కుక్క పాముతో పోరాడి పిల్లలను ఎలా కాపాడుకుందో చూడండి..!