కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ తో తెప్పల సమ్మిరెడ్డికి చెందిన ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. దూరికే శారద, అంజలి అనే ఇద్దరు ఒంటరి మహిళలు సమ్మిరెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజశేఖర్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని సుమారు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ఎస్ఐ తెలిపారు. మరోవైపు అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఘటనపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించారు. ఇందుకు సంబంధించి వివరాలను ఎస్ఐ రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సాయాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు.
