కొండంపేట గ్రామంలో నీటి కష్టాలకు చెక్.. బోరు వేయించిన మంత్రి వివేక్

కొండంపేట గ్రామంలో నీటి కష్టాలకు చెక్.. బోరు వేయించిన మంత్రి వివేక్

కోటపల్లి, వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామి కృషితో నీటి కష్టాలు తీరాయని కొండంపేట సర్పంచ్ ఆరె వెంకటమ్మ అన్నారు. కొద్ది రోజులుగా గ్రామంలోని 3వ వార్డులో నీటి కష్టాలు ఉన్నాయని తెలుసుకున్న మంత్రి వెంటనే బోరు వేయించారన్నారు.

సర్పంచ్ మాట్లాడుతూ గతంలో తమ గ్రామాన్ని పట్టించుకున్న నాథుడే లేడని, కానీ మంత్రి వివేక్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాయిడ రమేశ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.