కాగజ్ నగర్, వెలుగు: అడవులను కాపాడడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, అడవులను ప్లాస్టిక్ ఫ్రీ గా మార్చేందుకు ప్రజలు బాధ్యతగా ఉండాలని కాగజ్ నగర్ ఎఫ్డీవో అప్పయ్య అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సిర్పూర్ టీ రేంజ్ పెద్దబండ భీమన్నగుడి సమీపంలో, నీటి కుంటల వద్ద ప్లాస్టిక్ డ్రైవ్ నిర్వహించారు.
భక్తులు గుడి పరిసరాల్లో, అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థపదార్థాలు ఒకచోట మాత్రమే వేయాలని, వీలైతే తిరిగి వెళ్లేటప్పుడు తమ వెంట తీసుకెళ్లి డంప్ యార్డ్ లో వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ ప్రవీణ్ కుమార్, డీఆర్వో శశిధర్ బాబు, సెక్షన్ ఆఫీసర్ అక్తర్, ఎఫ్ బీవోలు పాల్గొన్నారు.
