జగిత్యాల టౌన్/ధర్మపురి, వెలుగు: ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఉన్న శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, పక్కన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం ఆలయ అర్చకులు ఆలయాన్ని తెరిచేందుకు రాగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి.
వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని వెండి ప్రాణ వట్టం, అమ్మవారి వెండి ముఖ కవచం చోరీకి గురైనట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు
