రక్షణ చర్యలు పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి : డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌వీ సూర్యనారాయణ

రక్షణ చర్యలు పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి :  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌వీ సూర్యనారాయణ

గోదావరిఖని, వెలుగు: రక్షణ చర్యలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డైరెక్టర్‌‌‌‌‌‌‌‌(ఆపరేషన్స్‌‌‌‌) ఎల్‌‌‌‌వీ సూర్యనారాయణ ఆఫీసర్లకు సూచించారు. గురువారం సింగరేణి సంస్థ ఆర్జీ 2 ఏరియాలో ఆయన పర్యటించారు. ఏరియా పరిధిలోని కోల్​హ్యాండ్లింగ్​ప్లాంట్, ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్ట్​3 క్వారీని సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, కోల్​ ట్రాన్స్​పోర్టు పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఏరియా జీఎం బి.వెంకటయ్య, ప్రాజెక్ట్​ ఆఫీసర్ ఉదయ్​హరిజన్, షిప్ట్​ ఇన్‌‌‌‌చార్జి శ్రీనివాస్​ ఉన్నారు. 

 ఆర్జీ 1 ఏరియాలోని ఓపెన్​కాస్ట్​5 ప్రాజెక్ట్‌‌‌‌ను ప్రాజెక్ట్​అండ్​ప్లానింగ్​జీఎం జి.దేవేందర్​సందర్శించారు. ప్రాజెక్ట్​ క్వారీలోని పనిస్థలాలను తనిఖీ చేశారు. క్వారీలో బొగ్గు మండకుండా తీసుకుంటున్న చర్యలను పరిశీలించి తగు సూచనలు చేశారు. జీఎం వెంట ప్రాజెక్ట్​ ఆఫీసర్​డి.రమేశ్‌‌‌‌, అఫిషియేటింగ్​ మేనేజర్​ శ్రీనివాస్​, సీనియర్​ సర్వే ఆఫీసర్​ చంద్రమౌళి, ప్రాజెక్ట్​ఇంజినీర్​ పి.రమేశ్‌‌‌‌​ ఉన్నారు.