సమస్యల పరిష్కారం కోసమే ‘ప్రగతి ప్రణాళిక’ : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

సమస్యల పరిష్కారం కోసమే ‘ప్రగతి ప్రణాళిక’ : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

తిమ్మాపూర్​, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌కు శ్రీకారం చుట్టిందని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ చిత్రా మిశ్రా, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్నిచేపట్టారన్నారు. కలెక్టర్​మాట్లాడుతూ 99 రోజుల కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందన్నారు. అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీపీవో జగదీశ్వర్, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో వెంకటరమణ, డీఆర్డీఓ శ్రీధర్, డీఏవో భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ రాజీవ్​ మల్హోత్రా, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.