కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి.. కేంద్ర మంత్రికి విన్నవించిన ఎమ్మెల్యే 

కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి.. కేంద్ర మంత్రికి విన్నవించిన ఎమ్మెల్యే 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిలో ఫ్లయింగ్​ అకాడమీ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  రామ్మోహన్​నాయుడును కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో  కేంద్ర మంత్రిని కలిసి ఫ్లయింగ్​ అకాడమీ ఏర్పాటు కోసం వినతి పత్రం అందజేశారు.

తెలంగాణ రాజధానికి సమీపంగా ఉండడంతో పాటు నేషనల్​హైవే,  రైల్వే లైన్​తో పాటు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు.  ఇక్కడ ఫ్లయింగ్​ అకాడమి ఏర్పాటు చేయడంతో ఈ ఏరియా అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.