కరీంనగర్ లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లాంటి క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాకా టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కాకా వెంకట స్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ రాష్ట్ర టీ 20 లీగ్ ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీస్తుందన్నారు. గతంలో మన రాష్ట్రం నుంచి హర్షద్ అయూబ్ ,శివలాల్ ,అజారుద్దీన్ , వీవీఎస్ లక్ష్మణ్, లు తెలంగాణ కీర్తిని భారతదేశానికి చాటారు. ఇప్పుడు సిరాజ్ ,తిలక్ వర్మ లాంటి వారు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు పొన్నం.
కరీంనగర్ లో కాకా మెగా క్రికెట్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మాట్లాడిన పొన్నం.. హుస్నాబాద్ లో 20 ఎకరాల్లో అద్భుతమైన స్టేడియం నిర్మించాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మంచి స్టేడియం నిర్మిస్తామని వివేక్ వెంకట్ స్వామి చెప్పారు. కరీంనగర్ లో క్రికెట్ , ఫుట్ బాల్ ,వాలి బాల్ ఇతర ఆటలు ఆడడానికి అంబేద్కర్ స్టేడియం ఉంది. స్పోర్ట్స్ కి సంబంధించి మంచి ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తుంది. కరీంనగర్ జిల్లా తెలంగాణలోనే ముందుండాలి. వివేక్ వెంకట్ స్వామికి క్రీడల అంటే ఇష్టం వారు సహకారం అందిస్తారు. కాకా మెమోరియల్ టీ20 లీగ్ మరింత అద్భుతంగా విజయం సాధించి ఎంతమంది క్రీడాకారులను వెలికితీయాలని కోరారు పొన్నం.
