జమ్మికుంటలో పంబ ఆరట్టు ఉత్సవం

జమ్మికుంటలో పంబ ఆరట్టు ఉత్సవం

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో పంబ ఆరట్టు ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. వందలాది మంది మాలధారుల అయ్యప్ప నామస్మరణతో జమ్మికుంట పట్టణం మార్మోగింది. అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి కేరళ వాయిద్య బృందంతో ఊరేగింపు నిర్వహించారు. 

అనంతరం వేంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలో గల కోనేటిలో అయ్యప్ప స్వామికి చక్రస్నానం చేయించి అభిషేకం చేశారు. గురుస్వాములు సిరిమల్లె జయేందర్, మనోహర్, సదాచారి, ప్రతాప్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, శివ ప్రసాద్, అశోక్, శ్రీను, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.