రామగుండం లయన్స్ క్లబ్‌‌‌‌‌‌‌‌కు మహిళా సారథులు

రామగుండం లయన్స్ క్లబ్‌‌‌‌‌‌‌‌కు మహిళా సారథులు

గోదావరిఖని, వెలుగు: రామగుండం లయన్స్ క్లబ్ 2026–27 సంవత్సరానికిగానూ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. లయన్స్​ భవన్‌‌‌‌‌‌‌‌లో నామినేషన్ కమిటీ చైర్మన్ పి.మల్లికార్జున్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్​ క్లబ్​ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా బంక కళావతి, సెక్రటరీగా కజాంపురం జయప్రద, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వడ్లకొండ ఉమారాణి, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా మనిషా అగర్వాల్ ఎంపిక అయినట్లు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌ గవర్నర్ ముద్దసాని ప్రమోద్‌‌‌‌‌‌‌‌ కుమార్ రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు వి.ఎల్లప్ప, ఎం.సారయ్య, ట్రెజరర్ రాజేంద్ర కుమార్, సభ్యులు పాల్గొన్నారు.