జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఘాట్ రోడ్డులో డిసెంబర్ 26న ఉదయం ఆటో ప్రమాదానికి గురైంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోదావరిఖని పట్టణానికి చెందిన విద్యాధర్ తన సొంత ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చాడు.
దర్శనం అనంతరం ఘాట్ రోడ్డు గుండా గుట్ట దిగే క్రమంలో ఆటో అదుపు తప్పి ఘాట్ రోడ్డు రక్షణ గోడను ఢీ కొని బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కొండగట్టు ఏ ఎస్సై శ్రీనివాస్ తమ సిబ్బందితో వచ్చి వీరిని 108 లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో బస్సు ప్రమాదం జరిగిన స్థలంలోనే ఆటో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.
