రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయిస్తామని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. సీఎంఆర్ సరఫరా, వానాకాలం సీజన్ వడ్ల కేటాయింపు, బ్యాంక్ గ్యారెంటీ తదితర అంశాలపై జిల్లాలోని మిల్లర్లతో ఆయన రివ్యూ చేశారు.
ముందుగా జిల్లాలోని అన్ని రా రైస్ మిల్లులవారీగా కేటాయించిన ధాన్యం, ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం వివరాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రైస్ మిల్లర్లు సీఎంఆర్ సరఫరా చేయాలని, తప్పనిసరిగా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో డీసీవో చంద్రప్రకాశ్, డీటీలు, సిబ్బంది పాల్గొన్నారు.
