అత్తాపూర్ మర్డర్ కేసు..నిందితులపై పీడీ యాక్ట్: సీపీ శ్రీనివాస్ రెడ్డి

అత్తాపూర్ మర్డర్ కేసు..నిందితులపై పీడీ యాక్ట్: సీపీ శ్రీనివాస్ రెడ్డి

అత్తాపూర్ లో  జరిగిన మర్డర్ కేసులో నిందితులపై పీడీ యాక్ట్ పెడతామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కేసు వివరాలను మీడియా ముందు  వెల్లడించారు  సీపీ.  ఏప్రిల్ 30న   అత్తాపూర్ పిల్లర్ 65 వద్ద ఓ యువకుడు మర్డర్ జరిగింది. బీహార్ కు చెందిన ఇద్దరు యువకులు పిల్లర్ నెంబర్ 65 వద్ద మొబైల్ చూస్తు కూర్చున్నారు.  బైక్ పై వచ్చిన ఇద్దరు నిందితులు సెల్ ఫోన్ స్నాచింగ్ కు  ప్రయత్నించారు. ఆ సమయంలో బీహార్ కు చెందిన  యువకులు ప్రతిఘటించారు. దీంతో నిందితుల బైక్ కింద పడింది.తప్పించుకునే ప్రయత్నంలో  నిందితుల్లో ఒకరు  బీహార్ కు చెందిన యువకుడిని కత్తితో పొడిచాడు.  దీంతో యువకుడు ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు. ఈ కేసులో నిందితుడు మహమ్మద్ అజీజ్ కురేశి నీ అరెస్ట్ చేశాం. మహమ్మద్ అసిస్ పై గతంలో ఏడు కేసులు ఉన్నాయి.   ఇందులో ఐదు కేసులు మొబైల్ స్నాచింగ్ కేసులే. ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. మర్డర్ కు ఒక రోజు ముందు నిందితులు కేపీ హెచ్ బీలో బైక్ దొంగతనం చేశారు. ఏప్రిల్ 30వ తేదీన రాత్రి మైలార్ దేవుపల్లిలో  సెల్ ఫోన్స్ స్నాచ్చింగ్ చేశారు.  ఇద్దరు నిందితుల్లో ఒకరు మైనర్ అని  వెల్లడించారు.

 CEIR లో  పోగొట్టుకున్న లేదా చోరీ  మొబైల్ ఫోన్ వివరాలు ఉంచుతున్నామని చెప్పారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. దీంతో మొబైల్ వాడినప్పుడు ఎవరు తన  మొబైల్ వాడుతున్నారో తెలిసే అవకాశం ఉంటుంది.  దీంతో సెల్ ఫోన్ లో రీసైక్లింగ్ చేస్తున్నారు.  స్నాచింగ్ చేసిన సెల్ ఫోన్లను సూడాన్ లాంటి దేశాలకు పంపుతున్నారని చెప్పారు. డిమాండ్ ఉండడంతో కొంతమంది గ్రూపులను ఏర్పాటు చేసుకొని స్నాచింగ్ లను ప్రోత్సహిస్తున్నారని సీపీ వెల్లడించారు.