CSK vs PBKS: రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్లు.. టీమిండియాకు తలనొప్పిగా మారిన దూబే

CSK vs PBKS: రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్లు.. టీమిండియాకు తలనొప్పిగా మారిన దూబే

ఐపీఎల్ లో శివమ్ దూబే శివాలెతుత్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటించకముందు వరకు వినిపిస్తున్న మాట ఇది. ఐపీఎల్ ప్రారంభం నుంచి విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లకు దడ పుట్టించిన దూబే.. టీ20 వరల్డ్ కప్ కు సెలక్ట్ అయిన తర్వాత ఘోరంగా  విఫలమవుతున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై విరుచుకుపడే ఇతను వరుసగా వారికే తన వికెట్స్ ను సమర్పించుకున్నాడు. రెండు మ్యాచ్ ల్లో తొలి బంతికే డకౌటయ్యాడు. ఈ రెండు మ్యాచ్ లు కూడా పంజాబ్ పైనే కావడం గమనార్హం.

ప్రస్తుతం దూబే ఆటతీరు చూస్తుంటే చెన్నై జట్టుకే కాదు టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారాడు. అతని ఐపీఎల్ ఫామ్ చూసి టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తే దూబే బిగ్ షాక్ ఇచ్చాడు. తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తే టీమిండియా ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. నిలకడగా రాణిస్తున్న రింకూ సింగ్ ను పక్కన పెట్టి మరీ దూబేను తీసుకోవడంతో విమర్శలు వచ్చాయి. దీనికి తగ్గట్లుగానే దూబే వరుస డకౌట్లు అవుతూ వస్తున్నాడు. 

మొదట తొమ్మిది మ్యాచ్ ల్లో 50కి పైగా సగటుతో 160 కి పైగా స్ట్రైక్ రేట్ తో 350 పరుగులు చేసిన దూబే.. వరల్డ్ కప్ ఎంపికైన తర్వాత వరుసగా రెండు మ్యాచ్ ల్లో డకౌట్ గా వెనుదిరిగాడు. ఆల్ రౌండర్ గా స్థానం దక్కించుకున్న దూబే.. బౌలింగ్ వేయకపోవడం అతనికి మైనస్ గా మారనుంది. మొత్తానికి భారత తుది జట్టులో ఖచ్చితంగా ఉంటాడన్న దూబే..ఇప్పుడు అతని స్థానం ప్రశ్నర్థకం చేసుకున్నాడు. మరి రానున్న మ్యాచ్ లోనైనా ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.