ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీకి మేడారం జాతర ఆదాయం రూ.3.28 కోట్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీకి మేడారం జాతర ఆదాయం రూ.3.28 కోట్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మేడారం జాతరకు భక్తులను చేరవేయడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం లభించింది. ఖమ్మం, ఇల్లెందు, ఏటూరినాగారం, చర్ల, వెంకటా పురం,భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం. మణుగూరు, మంగపేట ప్రాంతాల నుంచి మేడారానికి 214 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపింది.

ఆర్టీసీ బస్సుల్లో 2 లక్షల మంది మేడారానికి రాకపోకలు సాగించినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. కొత్తగూడెం నుంచి అత్యధికంగా 90 బస్సుల ద్వారా 45,431 మంది భక్తులను మేడారానికి చేర వేశారు. దీంతో రూ. కోటికి పైగా ఆదాయం వచ్చింది.