హరారే: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి అజేయంగా దూసుకెళ్తున్న యంగ్ ఇండియా ఆరో టైటిల్‌పై కన్నేసింది. ఈ క్రమంలో బుధవారం జరిగే సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని టీమిండియా ఈ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆయుష్ మాత్రే కెప్టెన్సీలోని జట్టు సూపర్ సిక్స్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 58 రన్స్ తేడాతో చిత్తు చేసి ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉంది.
బ్యాటింగ్‌లో అభిగ్యాన్ కుందు (199 రన్స్), వైభవ్ సూర్యవంశీ (196 ) ఫామ్‌లో ఉండగా.. విహాన్ మల్హోత్రా బ్యాట్‌తో పాటు బాల్‌తోనూ మెప్పిస్తున్నాడు. పేసర్లు హెనిల్ పటేల్, ఆర్.ఎస్. అంబరీశ్ చెరో 11 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. స్పిన్నర్ ఖిలన్ పటేల్ (8 వికెట్లు) కూడా కీలకంగా మారాడు.
కెప్టెన్ ఆయుష్ మాత్రే బౌలింగ్‌లో రాణిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచిన అఫ్గాస్తాన్ సంచలనంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఈ నెల 6న ఇంగ్లండ్‌తో ఫైనల్లో పోటీ పడనుంది. మంగళవారం జరిగిన తొలి సెమీస్‌లో ఇంగ్లండ్ 27 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
