మారాయిగూడెంలో మినీ సమ్మక్క -సారక్క జాతర షురూ

మారాయిగూడెంలో మినీ సమ్మక్క -సారక్క జాతర షురూ
  • అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 

భద్రాచలం, వెలుగు : దుమ్ముగూడెం మండలం మారాయిగూడెంలో ఆదివాసీల ఆరాధ్య దైవ్యం సమ్మక్క- సారక్కల జాతర మంగళవారం ప్రారంభమైంది.  ఈ జాతరకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరై అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవరబాలలు సోడె శాంతమ్మ, అచ్చమ్మలతోపాటు శివసత్తులు వెంట రాగా, ఆదివాసీల విశేష నృత్యాలతో మండమెలుగు ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

చెరువు వద్ద పూజలు చేసి జలాలను తీసుకొచ్చారు. ప్రతీ రెండేళ్లకొకసారి జరిగే ఈ మినీ మేడారం జాతరను ఘనంగా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్​గఢ్​, ఒడిశాల నుంచి భారీ సంఖ్యలో ఆదివాసీలు ఈ జాతరకు వస్తుండటంతో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రూ.10 లక్షలు కేటాయించి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మిషన్​భగీరథ, చేతి పంపులను ఆయన ప్రారంభించారు.