ఆగస్టు 15లోగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కమిటీలు పూర్తవ్వాలి..పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్ ఆదేశాలు

ఆగస్టు 15లోగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కమిటీలు పూర్తవ్వాలి..పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ మార్గదర్శకాలకు తగ్గట్టుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆగస్టు 15 నాటికి మండల, టౌన్, డివిజన్ కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్‌‌‌‌ పార్టీ జిల్లా నాయకత్వానికి పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్​ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కమిటీల ఎంపికకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలు, స్పష్టమైన కాలపరిమితితో కూడిన సర్క్యులర్‌‌‌‌ను జారీ చేశారు. నిర్దేశిత గడువులోగా నియామకాలు పూర్తి చేసే బాధ్యత జిల్లా నాయకత్వాని దేనని స్పష్టం చేశారు.