- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ ను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యాధికారులకు సూచించారు. మంగళవారం కొల్చారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్‌ను పరిశీలించారు. ల్యాబ్ రూములు, మెటీరియల్ పరిశీలించి ప్రాక్టికల్స్ ఏ విధంగా జరుగుతున్నాయనే వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రికార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు, ఆర్ట్స్ విద్యార్థులు స్పెషల్ క్లాసులకు అటెండ్ కావాలన్నారు. ఈ నెల 10 వరకు ప్రాక్టికల్స్జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ఆఫీసర్ మాధవి, చీఫ్ సూపరింటెండెంట్నవీన్, లెక్చరర్లు, సిబ్బంది ఉన్నారు.
