- కలెక్టర్ హైమావతి
ములుగు, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్హైమావతి హాస్టల్సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆమె మర్కుక్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, మర్కుక్, జగదేపూర్ పీహెచ్సీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్బాలో మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించి ఎస్ ఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టాక్ రిజిస్టర్ లో రాయకుండా ఇష్టానుసారంగా కూరగాయలు, సరుకులు అందిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఓపై చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అందుతున్న సేవలను ఆరా తీశారు. ప్రతీ గర్భిణి ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేసుకోవాలని సూచించారు. అన్ని టెస్టులు చేయాలని మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంలను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
