ఖమ్మం రూరల్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో మంగళవారం పలువురు సీపీఐ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. 27 డివిజన్ నుంచి సీపీఐ సీనియర్ నాయకులు గణపారపు వీరయ్యతోపాటు మధు, 20 మంది నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరినవారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఏదులాపురం తాల్లేసి తండా 24వ డివిజన్ లో సీపీఐ సీనియర్ నాయకుడు కృష్ణ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
