మసీదులో కాల్పులు జరిపిన వారిలో ఓ ఆస్ట్రేలియన్

మసీదులో కాల్పులు జరిపిన వారిలో ఓ ఆస్ట్రేలియన్

క్రైస్ట్ చర్చ్ లోని రెండు మసీదుల్లో కాల్పులు జరిపిన నలుగురిని న్యూజీలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ టెర్రర్ ఎటాక్ కు కుట్ర పన్నినవారిలో ఓ ఆస్ట్రేలియన్ ఉన్నాడని ప్రకటించారు. టెర్రరిస్ట్ చర్యలను తమ దేశం ఎప్పటికీ తిప్పికొడుతుందని చెప్పారు.

దీనిపై దాయాది ఆస్ట్రేలియా స్పందించింది. న్యూజీలాండ్ లో టెర్రర్ ఎటాక్ ను ఖండించారు ఆస్ట్రేలియా దేశ ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్. తమ దేశంలోని ప్రభుత్వ కార్యాలయాల ముందు జాతీయ జెండాలను సగం వరకు కిందకు దించి నివాళి అర్పించాలని ఆదేశించారు. న్యూజీలాండ్ లాగే.. తమదేశం కూడా అన్ని మత విశ్వాసాలు, సంస్కృతులకు నిలయమనీ.. కాల్పులు జరిపినవారంతా అతివాదులు, ఉన్మాదులని.. ద్వేషం, అసహనం ప్రదర్శించే ఇలాంటివారికి తమ రెండు దేశాల్లో బతికే హక్కే లేదని అన్నారు స్కాట్ మోరిసన్.