- ఆర్థిక ఇబ్బందులతో కట్టలేకపోయిన యువకుడు
- తండ్రికి, స్నేహితులకు ఫొటోలు మార్ఫింగ్ చేసి పంపిన ఏజెంట్లు
- పరువు తీస్తున్నారని ఆత్మహత్య
జోగిపేట, వెలుగు : ఓ ఆన్లైన్ లోన్‌యాప్ సంగారెడ్డి యువకుడి ప్రాణం తీసింది. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. అందోల్మండల పరిధిలోని కంసాన్‌పల్లికి చెందిన కాడెం శ్రీకాంత్(21) ఎంఆర్ఎఫ్ కంపెనీలో లేబర్. ఆన్లైన్ లోన్ యాప్స్ అయిన ట్రూ బ్యాలెన్స్, గ్రాండ్ ఫైనాన్సర్తో పాటు మరో ఆరు యాప్‌ల ద్వారా నవంబర్ నెలలో లోన్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు రూ.లక్షా ముప్పై వేలు కట్టాడు. వీటిని చెల్లించడానికే స్నేహితులు, పరిచయస్తుల దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది. ఇంకా రూ.80 వేలు కట్టాలంటూ లోన్ యాప్ ఏజెంట్లు వేధిస్తున్నారు. అదే పనిగా ఫోన్ చేసి తిడుతుండడంతో జనవరి మొదటి వారంలో ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకున్నాడు.
దీంతో లోన్ యాప్ ఏజెంట్లు శ్రీకాంత్ నాన్న పోచయ్య, అతడి తమ్ముడు, స్నేహితుడు కిరణ్ నంబర్లకు ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. శ్రీకాంత్ ఫొటోలు మార్ఫింగ్ చేసి వారికి పంపించారు. దీంతో పరువు తీస్తున్నానరి మనోవేదనకు గురైన శ్రీకాంత్ గత నెల30న గడ్డిమందు తాగాడు. సంగారెడ్డిలోని ప్రైవేట్దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. కేసు నమోదు చేసినట్లు జోగిపేట ఎస్ఐ అరుణ్‌కుమార్ చెప్పారు.
