ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు షురూ

ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు షురూ

హైదరాబాద్, వెలుగు: 2020–21 అకడమిక్ ఇయర్ కు గాను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ, ఇంటర్ అడ్మిషన్ల కోసం అధికారులు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు. గురువారం అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు టాస్ డైరెక్టర్ కృష్ణా రావు తెలిపారు. ఈ నెల10 నుంచి జనవరి 15 వరకు www. telanganaopenschool.org వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా, జనవరి15 వరకు లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.