సేమ్ సెక్స్ కపుల్స్ పెళ్లిని చట్టాలు, సమాజం గుర్తించవు

సేమ్ సెక్స్ కపుల్స్ పెళ్లిని చట్టాలు, సమాజం గుర్తించవు

ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: సేమ్ సెక్స్ కపుల్స్ మధ్య పెళ్లికి అనుమతి లేదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మన దేశ చట్టాలు, న్యాయ వ్యవస్థ, సమాజం, విలువల్లో దీనికి గుర్తింపు లేదని స్పష్టం చేసింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ (హెచ్ఎంఏ) స్పెషల్ మ్యారేజ్ చట్టం ప్రకారం సేమ్ సెక్స్ మ్యారేజ్‌‌కు గుర్తింపును ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై కేంద్రం తమ వాదనలు వినిపించింది. చీఫ్ జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ ప్రతీక్ జలన్‌‌ల ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ (ఎస్‌‌జీ) తుషార్ మెహ్తా వాదనలు వినిపించారు. ‘మన చట్టాలు, న్యాయ వ్యవస్థ, సమాజం, విలువలు ఈ తరహా పెళ్లిని గుర్తించవు. సేమ్ సెక్స్ కపుల్స్ మధ్య పెళ్లి అంటే మృతకర్మతో సమానం. కోర్టులు చట్టాలను మార్చడానికి యత్నిస్తే తప్ప ఇది సాధ్యం కాబోదు’ అని మెహ్తా పేర్కొన్నారు.