
గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు గట్టి షాక్తగిలింది. చైర్మన్ రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్పై కాంగ్రెస్పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఒకరు, ఇండిపెండెంట్కలిపి మొత్తం14 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు.
దీంతో అవిశ్వాస తీర్మాణానికి తమ మద్దతు తెలిపారు. దీంతో మున్సిపాలిటీని కాంగ్రెస్కైవసం చేసుకున్నట్లయింది. అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్ నాగపూర్ణ శ్రీనివాస్‌మాట్లాడుతూ.. రేఖయాదగిరి, వెంకటేశ్‌యాదవ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌అన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు ప్రజల్లో ఆదరణ కరువవుతుందన్నారు.