బాలకృష్ణ సినిమా ‘వీరసింహారెడ్డి’తో తెలుగులోనూ గుర్తింపును అందుకుంది మలయాళ నటి హనీరోజ్. ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్న మలయాళ చిత్రం ‘రాహేలు’. రాధికా రాధాకృష్ణన్, బాబు రాజ్, రోషన్ బషీర్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆనందిని బాలా దర్శకత్వం వహిస్తున్నారు. పోస్టర్స్, టీజర్‌తో సర్‌ప్రైజ్ చేసిన మేకర్స్.. ఇటీవల ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు.
మాంసం కొట్టు నడుపుకునే ఓ యువతి జీవితంలో ఎదురైన సంఘటనలు, అందుకు ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. హనీ రోజ్ గ్లామర్ ఈ సాంగ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రివెంజ్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 6న విడుదల కానుంది.
