IND vs SA: రెండో టెస్టులో టాస్ ఓడిన ఇండియా.. సౌతాఫ్రికా బ్యాటింగ్

IND vs SA: రెండో టెస్టులో టాస్ ఓడిన ఇండియా.. సౌతాఫ్రికా బ్యాటింగ్

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. శనివారం (నవంబర్ 22) గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ శుభమాన్ గిల్ దూరం కావడంతో స్టాండింగ్ కెప్టెన్ కావడంతో రిషబ్ పంత్ భారత కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ఇండియా రెండు మార్పిడులతో బరిలోకి దిగుతోంది. గిల్ స్థానంలో సాయి సుదర్శన్.. అక్షర్ పటేల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11లోకి వచ్చారు. మరోవైపు సౌతాఫ్రికా ఒక మార్పుతో మ్యాచ్ ఆడుతుంది. బాష్ స్థానంలో ముత్తుస్వామి జట్టులోకి వచ్చాడు. 

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్నే (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, సెనురన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్

భారత్ (ప్లేయింగ్ XI):

కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్