నిర్మల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ..కప్‌‌‌‌‌‌‌‌బోర్డు ఊడిపడి శిశువు మృతి

నిర్మల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ..కప్‌‌‌‌‌‌‌‌బోర్డు ఊడిపడి శిశువు మృతి

నిర్మల్, వెలుగు : కప్‌‌‌‌‌‌‌‌ బోర్డు ఊడి అప్పుడే పుట్టిన శిశువుపై పడడంతో బాబు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా సారంగాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం చించోలి (బి) గ్రామానికి చెందిన గంగలక్ష్మి అనే మహిళ శుక్రవారం పట్టణంలోని ఓ మెటర్నిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో డెలివరీ అయింది.

 బాబు పుట్టడంతో జనరల్‌‌‌‌‌‌‌‌ చెకప్‌‌‌‌‌‌‌‌ కోసం ఎస్‌‌‌‌‌‌‌‌వీఆర్‌‌‌‌‌‌‌‌ చిల్డ్రన్స్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు చిన్నారిని పరీక్షిస్తుండగా.. పైనుంచి కప్‌‌‌‌‌‌‌‌బోర్డు ఊడి శిశువుపై పడింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు.