రష్యాపై అమెరికా ఆంక్షలు.. రష్యా ఆయిల్ ఎగుమతులే లక్ష్యంగా అమెరికా విధించిన ఇవాళ్టి (శుక్రవారం ) నుంచి అమలులోకి వచ్చాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్దం నేపధ్యంలో రష్యాకు ఆదాయ వనరులు దెబ్బతీసే ప్రయత్నంలో అమెరికా రష్యాపై చర్యల్లో ఇదొకటి.గత నెలలో రష్యాన్ చమురు ఎగుమతి కంపెనీలు రోస్నెప్ట్ పీజెఎస్సీ, లుకోయిల్, పీజేఎస్సీలను బ్లాక్ లిస్టులో పెట్టింది అమెరికా. ఈ నిర్ణయంతో ప్రపంచ ఆయిల్ మార్కెట్ ను కుదిపేసింది. దీంతో రష్యా ముడి చమురు గ్రేడ్ లకు డిమాండ్ పడిపోయింది.
ఎనలిస్ట్ సంస్థ కెప్లర్ ప్రకారం.. రోస్ నెఫ్ట్, లుకోయిల్ కంపెనీలనుంచి దాదాపు 48 మిలియన్ బారెళ్ల ముడి చమురు రవాణాకు లోడింగ్ అయి సముద్రంలో సిద్దంగా ఉన్నాయి. ట్రంప్ ఆంక్షలతో సముద్రంలో నే చిక్కుకుపోయాయి.
ఈ ఆంక్షలు ఆసియా అంతటా తీవ్ర మార్పులకు దారితీశాయి. ఆంక్షలతో భయపడిన భారతీయ శుద్ధి కర్మాగారాలు మిడిల్ ఈస్ట్ నుంచి సరుకులను త్వరగా బుకింగ్ చేయడంతో గల్ఫ్-భారత్ మార్గాలకు సరుకు రవాణా రేట్లను దాదాపు ఐదు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేర్చింది.ప్రస్తుతం సముద్రంలో ఉన్న రష్యన్ కార్గోలకు, ముఖ్యంగా లుకోయిల్ ,రోస్‌నెఫ్ట్‌లకు చమురు కొనుగోలుదారులు ఎవరైనా చివరికి జోక్యం చేసుకుంటారా అని వ్యాపారులు వేచి చూస్తున్నారు.
