చరిత్రలో ఇదే తొలిసారి.. ఇరాన్ పై PrSM క్షిపణులతో అమెరికా దాడి!

చరిత్రలో ఇదే తొలిసారి..  ఇరాన్ పై PrSM క్షిపణులతో అమెరికా దాడి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో అమెరికా  కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ తో జరుగుతున్న యుద్దంలో అమెరికా చరిత్రలో మొదటి సారి లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణులు ప్రయోగించింది. క్షిపణికి సంబంధించి 25 సెకన్ల డిటెయిల్డ్ వీడియోను US సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

చరిత్రలో తొలిసారి.. ఆపరేషన్  ఎపిక ఫ్యూరి టైంలో  యుద్దంలో లాంగ్ రేజం ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణులను ఉపయోగించారు. ఇది డీప్ స్ట్రైక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని యూఎస్ సెంట్రల్ కమాండ్  సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో షేర్ చేసింది. 

PrSM క్షిపణి గురించి.. 

వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి అయిన PrSM..  GPS-గైడెడ్ క్షిపణి.  దీనిని M142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్  , M270 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ నుంచి  ప్రయోగిస్తారు.ఇవి కనీసం 500 కి.మీ పరిధిలో లక్ష్యాలను ఛేదించగలవు. ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి.హైపర్సోనిక్-క్లాస్ బాలిస్టిక్ క్షిపణి అయిన PrSM ను..ఉపగ్రహాలు, డ్రోన్లు ,రాడార్ వ్యవస్థలతో కూడా ప్రయోగించవచ్చు.