పాపం సంజు.. వరల్డ్ కప్‎లో వరుసగా రెండో సెంచరీ మిస్..!

పాపం సంజు.. వరల్డ్ కప్‎లో వరుసగా రెండో సెంచరీ మిస్..!

ముంబై: టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న సెమీ ఫైనల్ మ్యాచులో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ విధ్వంసం సృష్టించాడు. టాస్ ఓడి భారత్ తొలుత బ్యాటింగ్‎కు దిగగా ఆట తొలి ఓవర్ నుంచే ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 89 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 

ఈ మ్యాచ్ కంటే ముందు సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్‎తో జరిగిన మ్యాచులో కూడా సంజు శాంసన్ చెలరేగి ఆడిన విషయం తెలిసిందే. కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాను సెమీస్‎కు చేర్చాడు. కేవలం మూడు పరుగుల దూరంలో సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. 

అయితే.. రెండు మ్యాచుల్లో సంజు సెంచరీకి దగ్గర్లోనే నిలిచాడు. దీంతో పాపం సంజు.. వరుసగా రెండో సెంచరీ మిస్ చేసుకున్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెంచరీ మిస్ అయినప్పటికీ ఈ రెండు ఇన్నింగ్స్‎లు సెంచరీ కంటే ఎక్కువై అంటున్నారు సంజు చేట ఫ్యాన్స్.  

►ALSO READ | T20 World Cup: సంజు శాంసన్ సూపర్ బ్యాటింగ్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ జరుగుతున్న మ్యాచ్‎లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‎లో ఓపెనర్ సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 

కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 88 పరుగులు చేసి జస్ట్ మిస్ లో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. శివమ్ దూబే (43), ఇషాన్ కిషన్ (39) రాణించారు. చివర్లో హార్ధిక్ పాండ్య (27), తిలక్ వర్మ (21) సిక్సర్ల వర్షం కురిపించి టీమిండియాకు భారీ స్కోర్ అందించారు.