దిస్పూర్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు చెందిన సుఖోయ్ MKI 30 ఫైటర్ జెట్ అదృశ్యమైంది. అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో గురువారం (మార్చి 5) సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాడార్ నుంచి మిస్ అయినట్లు అధికార వర్గాల సమాచారం. ఫైటర్ జెట్ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు గౌహతి డిఫెన్స్ పీఆర్వో వెల్లడించారు.
కొన్ని నివేదికల ప్రకారం.. విమానం కుప్ప కూలిపోయిందని.. స్థానికులు పెద్ద పేలుడు శబ్దం కూడా విన్నట్లు తెలుస్తోంది. అయితే, ఐఏఎఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా దీనిని ధృవీకరించలేదు. ఘటన స్థలంలో శోధన, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
