T20 World Cup: టీ20 ఫైనల్కి భారత్.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్పై విజయం

T20 World Cup: టీ20 ఫైనల్కి భారత్.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్పై విజయం

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.  చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ గెలిచి ఫైనల్ కి దూసుకెళ్లింది. దీంతో మార్చి 8వ తేదీన కివీస్ తో టైటిల్ పోరుకు సిద్ధమైంది ఇండియా. కాగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్ సంజు శాంసన్ ( 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 88 పరుగులు) అద్భుతమైన బ్యాటింగ్ కి తోడు శివమ్ దూబే ( 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 43 పరుగులు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు), హార్దిక్ పాండ్యా ( 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు), తిలక్ వర్మ ( 7 బంతుల్లో 3 సిక్సులతో 21 పరుగులు) రాణించడంతో జట్టు 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.

మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (7 బంతులు ఆడి కేవలం 9 పరుగులు) దారుణంగా విఫలం అయ్యాడు. అలాగే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 6 బంతుల్లో 11 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్ లో స్టంప్ ఔట్ అయ్యాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత సెకండ్ ఓవర్ తొలి బంతికే హార్ధిక్ పాండ్యా బౌలింగ్ లో సాల్ట్ (5) అవుట్ అయ్యాడు. 

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జస్ ప్రీత్ బుమ్రా వేసిన ఫస్ట్ బాల్‎కే ఇంగ్లాండ్ కెప్టెన్ ని బోల్తా కొట్టించాడు. 7 పరుగులు చేసి బ్రూక్ పెవిలియన్ కి చేరుకున్నాడు. ఇక జట్టును ఆదుకునే క్రమంలో మరో ఓపెనర్ జోస్ బట్లర్ సైతం 25 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ బాంటన్ వరుసగా అక్షర్ పటేల్ బౌలింగ్ లో రెండు సిక్సులు కొట్టిన తర్వాత క్లిన్ బౌల్డ్ అయ్యాడు. 

తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జాకబ్ బెథెల్, విల్ జాక్స్ ఇద్దరు కలిసి ఇండియన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరు కలిసి 77 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అర్ష్ దీప్ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి బౌండరీ లైన్ వద్ద అక్షర పటేల్ తొలుత బంతిని అందుకునే క్రమంలో బౌండరీని తాకే ప్రమాదం ఉందని గ్రహంచి బంతిని విసిరాడు.. అక్కడే ఉన్న శివమ్ దూబే దాని పట్టుకోవడంతో విల్ జాక్స్ ( 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు) డగౌట్ కి చేరుకున్నాడు. ఇక 18వ ఓవర్ వేసిన బుమ్రా సూపర్ గా బౌలింగ్ వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ ఇండియా వైపు మళ్లీంది. కాగా జాకబ్ బెథెల్ చివరి వరకు పోరాటం చేసిన ఫలితం మాత్రం దక్కలేదు. శివమ్ దూబే బౌలింగ్ లో బెథేల్ (48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సులతో 105 పరుగులు)  రనౌట్ అయ్యాడు. దీంతో 7 పరుగుల తేడాతో గెలిచింది.