హైదరాబాద్ ను క్రీడాహబ్ గా మారుస్తున్నాం: మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ ను క్రీడాహబ్ గా మారుస్తున్నాం: మంత్రి వాకిటి శ్రీహరి

నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్ శివసేన రెడ్డి , ఎండీ సోని బాలదేవిలతో కలిసి మంత్రి మాట్లాడారు.

గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై విమెన్ హాకీ టోర్నమెంట్ 2026 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్ శివసేన రెడ్డి , ఎండీ సోని బాలదేవిలతో కలిసి మంత్రి మాట్లాడారు.

సీఎం  రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ ను క్రీడా హబ్ గా తయారు చేస్తున్నామని , స్పోర్ట్స్ యూనివర్సిటీ ను ఏర్పాటు చేయనున్నట్లు  తెలిపారు. మార్చి 8 నుంచి 14 వరకు జరిగే ఈ పోటీలు గచ్చిబౌలిలోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరుగుతాయన్నారు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఇందులో నుండి మూడు జట్లు మహిళ హాకీ వరల్డ్ కప్ లో పాల్గొంటాయన్నారు. టోర్నమెంట్‌ను లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అన్ని సదుపాయాలను చేసిందని , అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్ట్రోటర్ఫ్ మైదానం, హై సెక్యూరిటీ, ఆధునిక సదుపాయాలు, క్రీడాకారులకు అత్యుత్తమ వసతి ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.

అనంతరం మార్చి 8 నుంచి జరిగే  ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై ఉమెన్ హాకీ టోర్నమెంట్ కు రావాలని సీఎం  రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీ బాలా దేవి.