మోస్ట్ వాంటెడ్ ఉప్పల సతీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల నుంచి పరారీలో ఉన్న సతీష్ ను ముంబైలో అరెస్ట్ చేశారు పోలీసులు.
రూ.23 కోట్ల మోసం కేసులో సతీష్ ప్రధాన నిందితుడు, ఈ కేసులో అతను కేంద్ర మాజీ మంత్రి కుమారుడు కూడా అయిన సీనియర్ డాక్టర్‌తో సహా అనేక మంది పెట్టుబడిదారులను మోసం చేశాడు. ఎంతో చాకచక్యంగా అక్టోబర్ లో సతీష్ ను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
అయితే రెండు కోట్లు తీసుకుని టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ సతీష్‌ను తప్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ను సస్పెండ్ చేశారు అధికారులు. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న ఉప్పల సతీష్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇవాళ ముంబైలో సతీష్ ను పట్టుకున్న పోలీసులు హైదరాబాద్ కు తీసుకురానున్నారు.
