MS Dhoni: కోచ్ సాబ్.. మీ స్మైల్ చాలా బాగుంది.. గౌతమ్ గంభీర్ పై ఎంఎస్ ధోని ప్రశంసలు

MS Dhoni: కోచ్ సాబ్.. మీ స్మైల్ చాలా బాగుంది.. గౌతమ్ గంభీర్ పై ఎంఎస్ ధోని ప్రశంసలు

MS Dhoni: టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించడంతో దేశవ్యాప్తంగా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరిగాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ టీమ్ ను చిత్తుగా ఓడించిన భారత్ మూడోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంపై సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందిస్తూ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఎస్ ధోనీ తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. అహ్మదాబాద్‌లో చరిత్ర సృష్టించారు.. టీమిండియా క్రికెట్ జట్టుకు, సపోర్ట్ స్టాఫ్‌కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కు హృదయపూర్వక అభినందనలు.. మీరు ఆటను చూడటం చాలా ఆనందంగా ఉంది.. 'కోచ్ సాబ్'.. మీ ముఖంపై చిరు నవ్వు చాలా బాగుంది.. కోపం, చిరునవ్వు.. ఈ రెండింటి కలయిక కిల్లర్ కాంబినేషన్! చాలా బాగా మిక్స్ చేశారు, ఎంజాయ్ చేయండి గైస్! అని పోస్టులో పేర్కొన్నారు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా గురించి రాసుకొచ్చిన పోస్టులో.. "బుమ్రా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన ఛాన్స్ లేదు.. అతను ఒక ఛాంపియన్ బౌలర్" అంటూ కొనియాడారు.

ఎంఎస్ ధోనీ ప్రశంసలతో కోచ్ గౌతమ్ గంభీర్ విజయం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో జరిగే అనవసర చర్చలపై రియాక్ట్ అవుతూ.. సోషల్ మీడియాలో విమర్శించే వారి పట్ల నాకు ఎలాంటి జవాబుదారీతనం లేదు.. నా బాధ్యత అంతా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్లేయర్స్, స్టాఫ్ గురించి మాత్రమే.. ఒక కోచ్ తన జట్టు ఎంత బాగుంటే అంత గొప్పగా ఉంటాడు.. నన్ను ఒక కోచ్‌గా తీర్చిదిద్దింది ఈ ఆటగాళ్లేనని గౌతమ్ గంభీర్ తేల్చి చెప్పారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781)