బంగాళాఖాతంలో తుఫాను.. సముద్రం అల్లకల్లోలం.. రెండు రోజులు అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తుఫాను.. సముద్రం అల్లకల్లోలం.. రెండు రోజులు అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) అండమాన్, నికోబార్ దీవులలో తుఫాను హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 21 నుంచి ఈ ఉపరితల ఆవర్తనం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫానుకు 'సెన్యార్' అని పేరు పెట్టారు. తుఫాను కారణంగా.. నికోబార్ ద్వీపంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అండమాన్ ద్వీపంలో కూడా భారీ వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గంటకు 55 కి.మీ వేగంతో తీవ్రమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, నవంబర్ 23 వరకు అండమాన్ సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. 

ALSO READ : ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సీవీ ఆనంద్ ట్వీట్ ఏం చెప్తున్నదంటే..

పర్యాటకులు, సాధారణ ప్రజలు సముద్రంలోకి వెళ్లవద్దని.. స్థానిక అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా మార్గదర్శకాలను పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. పోర్ట్ బ్లెయిర్ పోర్టు దగ్గర సిగ్నల్-3 హెచ్చరిక జారీ చేశామని అధికారులు తెలిపారు. ఈ తుఫానుకు ‘సెన్యార్’ అని ఎందుకు పేరు పెట్టారంటే.. సెన్యార్ అంటే 'సింహం' అని అర్థం.