ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సీవీ ఆనంద్ ట్వీట్ ఏం చెప్తున్నదంటే..

ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సీవీ ఆనంద్ ట్వీట్ ఏం చెప్తున్నదంటే..

ఐబొమ్మ రవి అరెస్ట్​తో ఊరట చెందిన తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు నాలుగు రోజులు తిరగకముందే మళ్లీ షాక్ తగిలింది. రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడితోనే ఐబొమ్మ, బప్పం సైట్లను క్లోజ్​చేయించిన సంగతి తెలిసిందే. అయితే ‘‘ఐబొమ్మ వన్’’​ పేరుతో గురువారం కొత్త వెబ్‌‌సైట్ కనిపించడం కలకలం రేపింది. 

ఈ సైట్‌‌లో కొత్త సినిమాలు కనిపించగా వాటిపై క్లిక్ చేస్తే మూవీ రూల్జ్​అనే పైరసీ ప్లాట్‌‌ఫామ్‌‌లకు రీడైరెక్ట్ అవుతున్నది. ఐబొమ్మ గ్లోబల్ నెట్ వర్క్ టీమ్ ఈ పైరసీ వెబ్ సైట్లు నిర్వహిస్తుందా? లేక కొత్తవారు తయారు చేశారా అన్నది తేలడం లేదు. ఈ నేపథ్యంలో మూవీరూల్జ్, తమిళ్‌‌ఎమ్‌‌వీ వంటి సైట్లపై కూడా చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

సీవీ ఆనంద్​ ట్వీట్ ఏం చెప్తున్నదంటే

హ్యాకర్లు, సైబర్ క్రైమ్స్ పూర్తిగా అంతమవుతాయని భావించడం అసాధ్యమని, నివారణ మాత్రమే శాశ్వత పరిష్కారమని హోంశాఖ ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్ గురువారం ‘ఎక్స్’​లో పోస్టు చేశారు. ఐబొమ్మ రవి అరెస్టుతో పైరసీ ఆగుతుందా అని ప్రముఖ న్యాయనిపుణుడు కట్కూరి.. వీ6 వెలుగులో రాసిన ఆర్టికల్​ను ‘ఎక్స్’​లో ట్యాగ్​చేస్తూ ఆయన ఈ అభిప్రాయన్ని పంచుకున్నారు. ‘హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. 

ఒకడు పోతే మరొకడు వస్తాడు, అది కూడా ఇంకా లేటెస్ట్​టెక్నాలజీతో.. కొందరిని అరెస్టు చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అసాధ్యమైన ఆశ. పెద్ద, సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల గ్యాంగ్స్‌‌ను పట్టుకున్న తర్వాత దొంగతనాలు, చోరీలు, దాడులు, మోసాలు అన్నీ ఆగిపోయాయా!!??..మనిషి ఉన్నంత కాలం ఈ రకాల నేరాలు కూడా ఉంటూనే ఉంటాయి’ అని అందులో పేర్కొన్నారు.