కలెక్టరేట్ కు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి.. కామారెడ్డిలో మళ్లీ టెన్షన్..

కలెక్టరేట్ కు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి.. కామారెడ్డిలో మళ్లీ టెన్షన్..

కామారెడ్డి భూముల వ్యవహారంపై ఫిబ్రవరి 23న  కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే  వెంకట రమణా రెడ్డి  కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టర్  చాంబర్ లో అధికారులతో భేటీ అయ్యారు.  

డిగ్రీ కాలేజీల భూముల వ్యవహారంలో కొన్ని రోజులుగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,  ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాలేజ్ భూముల వ్యవహారం పై ఇవాళ కలెక్టర్ రేట్ కు వెళ్తానన్న ఆయన..భూములకు సంబంధించిన పూర్తివివరాలతో కలెక్టరేట్ కు వెళ్లారు.

ఈ సందర్బంగా మాట్లాడిన ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి. మేము తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.  డిగ్రీ కాలేజీ భూముల్లో ఒక్క గజం పొరపాటు చేసినా రాజీనామా చేస్తా.  నేను షబ్బీర్ అలీకి సవాల్ చేశాను.  ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదు . కొందరు మొరుగుతున్నారు.. వారి సంగతి తర్వాత చూస్తాం.  వొర్రినోళ్ళ వీపు సున్నం అయితది. ఎవరు రెచ్చగొడుతున్నారో పోలీసులకు తెలియదా.? అధికారులు దీని నిగ్గు తేల్చాలి.  ఆర్టీఐ  కింద వివరాలు అడిగానని అన్నారు. 

►ALSO READ | జగిత్యాల జిల్లాలో పెద్దపులి.. భయాందోళనలో జనం