జగిత్యాల జిల్లాలో పెద్దపులి.. భయాందోళనలో జనం

జగిత్యాల జిల్లాలో పెద్దపులి.. భయాందోళనలో జనం

జగిత్యాల జిల్లా  భీమారం మండలం మోత్కూర్ రావుపేటలో‌ పెద్దపులి కలకలం  సృష్టిస్తోంది.  గ్రామ శివారులో రైతులకు పెద్దపులి కనిపించినట్లు చెప్పడంతో స్థానికంగా భయాందోళనలకు గురయ్యారు.  గ్రామస్తులు  అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.  

 గ్రామ శివారులోని మైసమ్మ గుడి‌ప్రాంతంలో  పులి పాదముద్రలను గుర్తించారు అధికారులు.  ఆ‌ అడుగులు పెద్దపులివేనని తేల్చారు ఫారెస్ట్ అధికారులు.  అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.  అడవి, గుట్టలు ఎక్కువ ఉండటంతో వ్యన్యప్రాణుల  కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  రైతులు గుట్టల ప్రాంతం వైపు, వ్యవసాయపనులకు వెళ్ళేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  గ్రామంలో ప్రజలు అడవివైపు వెళ్లద్దని డప్పుతో చాటింపు చేశారు.