తిరుమల బాలాజీ నగర్ లో పోలీసుల తనిఖీలు... కొత్త వ్యక్తుల సంచారంపై ఫోకస్..

తిరుమల బాలాజీ నగర్ లో పోలీసుల తనిఖీలు... కొత్త వ్యక్తుల సంచారంపై ఫోకస్..

తిరుమల బాలాజీ నగర్ లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు పోలీసులు. స్థానికేతరులు వచ్చి కొండపై మద్యం, మాంసం అమ్ముతున్న ఘటనలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు సోమవారం ( ఫిబ్రవరి 23 )తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజయ్ శేఖర్ మాట్లాడుతూ... తిరుమలలో స్థానికులు నివాస ప్రాంతాలలో స్థానికులు మాత్రమే ఉండాలని కొత్త వ్యక్తులు ఉండొద్దని అన్నారు.

కొత్త వ్యక్తులు వచ్చి ఇండ్లు అద్దెకు తీసుకొని మద్యం, మాంసం అమ్ముతున్నారని..స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తిరుమల క్షేత్రంలో పవిత్రత దెబ్బతినకుండా కాపాడాల్సిన భాద్యత అందరిపైన ఉందని అన్నారు డీఎస్పీ.తిరుమలలో నిరంతరం తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు డీఎస్పీ.